మాస్ జాతర టీజర్‌... అంతా మామూలే!

భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ, శ్రీలీల జంటగా చేసిన ‘మాస్ జాతర’ ఈ నెల 27న వినాయక చవితి సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నిన్న టీజర్‌ విడుదల చేశారు. 

సినిమా పేరుతోనే ‘మాస్’ అని చెప్పేశారు కనుక టీజర్‌ కూడా అలాగే ఉంది. కాకపోతే ఈసారి పోలీసు వేషం బదులు రైల్వే పోలీస్ వేషం వేశారు. కానీ ఈ సినిమాలో కూడా అదే ‘మాస్ జాతర’ ఉంటుందని టీజర్‌తో తేల్చి చెప్పేశారు.       

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన మాస్ జాతరకు  సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.