పెద్ది కోసం ఊ అంటున్నావా సమంతా?

పుష్ప-1లో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా...’ నేటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడో అక్కడ ఎదో ఓ సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. ఆ పాట, దానికి సమంత చేసిన డాన్స్ అంతగా పాపులర్ అయ్యింది.

సమంత-రామ్ చరణ్‌ ఇదివరకు రంగస్థలంలో జంటగా చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కనుక ఆమెతో ‘పెద్ది’ కోసం ఓ స్పెషల్ సాంగ్ చేయించాలని దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారట! ఈ వార్తని బుచ్చిబాబు ఇంకా ద్రువీకరించాల్సి ఉంది. కానీ పెద్ది కోసం స్పెషల్ సాంగ్ చేసేందుకు సమంత అప్పుడే ‘ఊ’ అనేసిందని తెలుస్తోంది.

పెద్దిలో రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ చేస్తుండగా, జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు. 

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ గ్లింమ్స్‌లోనే ప్రకటించారు.