వడ్డే నవీన్ గుర్తున్నారా? మళ్ళీ వస్తున్నారు!

సినీ పరిశ్రమలో సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు ఎప్పుడూ ఉంటారు. వారిలో సీనియర్స్ ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా వాటిని తట్టుకొని దశాబ్దాలపాటు నిలబడుతుమ్తార్రు. కానీ జూనియర్స్ మాత్రం తట్టుకోలేక సినీ పరిశ్రమ నుంచి దూరం అవుతుంటారు. అటువంటి నటుడే వడ్డే నవీన్.

ఒకప్పుడు వరుస పెట్టి అనేక సినిమాలు చేసిన వడ్డే నవీన్ క్రమంగా సినీ పరిశ్రమ నుంచి కనుమరుగయ్యారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోందని తెలియజేస్తూ నిన్న రాఖీ పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు.

దీనిలో వడ్డే నవీన్ పోలీస్ కానిస్టేబుల్‌గా చేస్తున్నారని పోస్టర్‌తో, నిజాయితీ కారణంగా తరచూ బదిలీ అవుతుంటారని టైటిల్‌తో చెప్పేశారు.

ఈ సినిమాకు దర్శకత్వం: కమల్‌ హాసన్‌ తెలంగాణ జాగృతి నార్ల, సంగీతం: కళ్యాణ్ నాయక్, కెమెరా: కార్తీక్ సుజాత సాయి కుమార్, పాటలు: భాస్కర భట్ల, ఎడిటింగ్: విజయ్ దేవరకొండ ముక్తవరపు, కోరియోగ్రఫీ: విజయ్ దేవరకొండ పోలాకి, యాక్షన్ కోరియోగ్రఫీ: రామ్ సుంకర చేస్తున్నారు. 

 ఈ సినిమాని వడ్డే క్రియేషన్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే నవీన్ స్వయంగా నిర్మిస్తున్నారు.