ఉస్తాద్‌ తర్వాత దిల్ రాజుతోనే..

దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తిచేయడంలో చాలా బిజీగా ఉన్నారు. దీనిలో పవన్‌ కళ్యాణ్‌ చేయాల్సిన సన్నివేశాలు పూర్తయిపోయాయి కనుక మిగిలిన నటీనటులతో చేయాల్సిన సన్నివేశాలు కూడా పూర్తి చేస్తున్నారు.

సెప్టెంబర్ నెలాఖరుకి ఉస్తాద్ షూటింగ్ మొత్తం పూర్తయిపోతుందని సమాచారం. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరో నెల రోజులు అనుకుంటే నవంబర్‌నాటికి హరీష్ శంకర్ ఖాళీ అవుతారు. కనుక అప్పుడే ఆయన తన తర్వాత సినిమాకి కధ రెడీ చేసుకొని నిర్మాత దిల్ రాజుకి చెప్పగా ఆయన ఒకే చెప్పేశారు. 

గతంలో హరీష్ శంకర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాధం సినిమాలు చేశారు. కనుక మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత నిర్మాత దిల్ రాజుతో కలిసి చేయబోతున్నారు. టాలీవుడ్‌లో ఓ పెద్ద స్టార్ హీరోతో దీనిని పాన్ ఇండియా మూవీగా తీయాలని వారిరువురు ప్లాన్ చేస్తున్నారు.