
నితిన్ చేసిన రాబిన్‌హుడ్, తమ్ముడు రెండూ నిరాశ పరచడంతో మళ్ళీ గాడిలో పడాలంటే తప్పనిసరిగా ఓ హిట్ పడాలి. బలగం వంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన వేణు ఎల్దండితో ‘ఎల్లమ్మ’ చేస్తున్నాడు.
ఈ సినిమాలో సాయి పల్లవి కూడా ఉంది. ఆమె సినిమాల ఎంపిక చాలా బాగుంటుంది. ఆమె నటించిన దాదాపు ప్రతీ చిత్రం హిట్ అవుతుంటుంది. కనుక ఎల్లమ్మతో నితిన్‌కి హిట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కానీ నితిన్ వంటి యువ హీరోకి కమర్షియల్ లేదా రొమాంటిక్ సినిమాతో హిట్ పడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. కనుక ఇదివరకు ‘ఇష్క్’తో హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్‌తో మళ్ళీ మరో సినిమా చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా కధ గురించి ఇద్దరూ చర్చించుకున్నాక ఓకే అనుకున్నారు.
క్రీడా నేపధ్యంతో తీయబోతున్న ఈ సినిమాలో నితిన్ గుర్రం సవారీ చేసే ప్రొఫెషనల్‌గా నటించబోతున్నాడు. కనుక ఈ సినిమా కోసం గుర్రపు సవారీ నేర్చుకుంటున్నాడు. ఈ సినిమా పేరు ‘స్వారీ’ అని సమాచారం.
దీనిలో హీరోయిన్గా పూజా హెగ్డేని తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించబోతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయినట్లు తెలుస్తోంది.