
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర చేసిన ‘పరదా’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు అనుపమ సమాధానం చెపుతూ, “ఇంతవరకు నేను చేసిన చాలా సినిమాలు హీరో ఓరియంటెడ్ సినిమాలున్నాయి. ఈ సినిమాలో హీరో లేడు కనుక ఇది హీరోయిన్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అనుకోకూడదు. నిజానికి ఇది కంటెంట్ ఓరియంటెడ్ సినిమా. ఈ సినిమాలో కధ, కంటెంట్‌లే కీలకం. కనుక ప్రతీ ప్రేక్షకుడు ఈ సినిమాలో భావోద్వేగాలతో తప్పక కనెక్ట్ అవుతారు. అలా ఆయితే మా సినిమా విజయం సాధించినట్లే. మా ‘పరదా’ ఆలోచన ఫలించినట్లే,” అని అన్నారు.
ఓటీటీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఓటీటీ సంస్థలు మా సినిమా తీసుకోవడానికి ముందుకు వస్తున్నాయంటే అర్ధం సినిమా బాగుంటుందనే నమ్మకంతోనే కదా?కనుక మా పరదాని ఓటీటీ బుక్ చేసుకోవడం శుభపరిణామంగానే చూస్తాను,” అని అనుపమ పరమేశ్వరన్ అన్నారు.
పరదా ట్రైలర్ చూస్తే చాలా బలమైన కంటెంట్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. పరదాల మాటున బ్రతకాల్సిన ఊరి మహిళల అంతరంగాలను ఓ బలమైన కధతో దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాలో ఆవిష్కరించినట్లు అర్ధమవుతోంది.
ఈ సినిమాలో దర్శన్ రాజేంద్రన్, సంగీత తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు సంగీతం: గోపీ సుందర్, కెమెరా: మృధుల్ సుజీత్ సేన్, ఆర్ట్: శ్రీనివాస్ కాళింగ, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల చేశారు.
ఆనంద్ మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ కలిసి నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 22న విడుదల కాబోతోంది.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/Cy_C0qSqqtM?si=cgqHkAEoJgtef5EM" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>