మోగ్లీ 2025.. సాక్షి మధోల్కర్ పోస్టర్

యువ హీరో రోషన్ కనకాల, సాక్షి మధోల్కర్ జంటగా చేస్తున్న ‘మోగ్లీ 2025’ గత ఏడాది డిసెంబర్‌ 19న పూజా కార్యక్రమం చేసి ఫిబ్రవరి 14న షూటింగ్‌ ప్రారంభించారు. ఈరోజు హీరోయిన్‌ సాక్షి మధోల్కర్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు.  

సందీప్ రాజ్ కధ, దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంగీతం: కాల భైరవ్, కెమెరా: ఎం రామమూర్తి, ఎడిటింగ్: పవన్ కళ్యాణ్‌, ఆర్ట్: కిరణ్ మామిడి, యాక్షన్: నారాజ్ మడిగొండ చేస్తున్నారు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 42గా నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభొట్ల నిర్మాతలు.