వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ యూసఫ్‌ గూడాలో... రేపే

జూ.ఎన్టీఆర్‌ తొలిసారిగా చేసిన హిందీ చిత్రం వార్-2. ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ‘వార్-2'లో బాలీవుడ్‌ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ విలన్‌గా నటించగా జూ.ఎన్టీఆర్‌ అతనిని అంతమోదించేందుకు బయలుదేరిన ‘రా ఏజంట్’గా నటించారు.

ఈ సినిమాని హిందీ, తెలుగుతో సహా 5 భారతీయ భాషల్లో ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. కనుక రేపు (ఆదివారం) సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌, యూసఫ్‌ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరుగబోతోంది.

కానీ హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేరే చోటికి లేదా పొరుగు రాష్ట్రం ఏపీకి మార్చే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కనుక వాతావరణం అనుకూలిస్తే యూసఫ్‌ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లోనే వార్-2 జరుగవచ్చు.

ఇటీవల విడుదల చేసిన వార్-2 ట్రైలర్లో జూ.ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్ చేసిన యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. ఈ సినిమాకి కధ: ఆదిత్య చోప్రా, దర్శకత్వం: ఆయన్ ముఖర్జీ , స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్, సంగీతం: ప్రీతం, కెమెరా: బెంజామిన్, ఎడిటింగ్: ఆరీఫ్ షేక్, స్టంట్స్: స్పైరో రాజాతోస్, ఫ్రాంజ్ స్పిల్ హౌస్, అనల్ అరసు చేశారు. 

ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ప్రముఖ బాలీవుడ్‌ సినీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.