
జైన్స్ నాని అనే కొత్త దర్శకుడితో కిరణ్ అబ్బవరం చేస్తున్న ‘కె-ర్యాంప్’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా నుంచి ఓనం సాంగ్ టైటిల్‌తో లిరికల్ వీడియో సాంగ్ నేడు విడుదలైంది. సురేంద్ర కృష్ణ వ్రాసిన ఈ పాటని చైతన్ భరద్వాజ్ స్వరపరిచి సంగీతం అందించడమే కాకుండా సాహితీ చాగంటితో కలిసి హుషారుగా పాడారు.
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకి జోడీగా యుక్తి తరేజా నటిస్తోంది. వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: జైన్స్ నాని, సంగీతం: చేతన్ భరద్వాజ, కెమెరా: సతీష్ రెడ్డి మాసం, ఆర్ట్: సుధీర్ మాచర్ల, ఎడిటింగ్: ఛోటా కే ప్రసాద్ చేస్తున్నారు.
హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ సినిమాకి సహ నిర్మాతలు బాలాజీ గుట్ట, ప్రభాకర్ బురుగు. అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల కాబోతోంది.