
వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా చేస్తున్న జటాధర టీజర్ ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా విడుదల చేశారు.
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఈ సినిమాతో టాలీవుడ్లో ప్రవేశిస్తున్నారు. జటాధరలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ఝాన్సీ, శ్రేయ శర్మ, నవీన్ నేని, ఇందిరా కృష్ణ రవి ప్రకాష్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ: వెంకట్ కళ్యాణ్, దర్శకత్వం: వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ చేశారు.
ఈ సినిమాని జీ స్టూడియో బ్యానర్‌పై ఉమేశ్ కె.ఆర్.భన్సాల్, ప్రేరణ అరోరా కలిసి పాన్ ఇండియా మూవీగా జటాధర నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.