
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ‘కిష్కిందపురి’ నుంచి ఉండిపోవే నాతోనే.... అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ నేడు విడుదలైంది. పూర్ణాచారి వ్రాసిన ఈ పాటకి చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చగా, జావేద్ అలీ ఆలపించారు.
కొంత కాలం విడుదల చేసిన ఫస్ట్ గ్లింమ్స్‌లో “కొన్ని తలుపులు ఎన్నడూ తెరవకూడదు.. కొన్ని శబ్ధాలు ఎన్నడూ వినకూడదు.. కొన్ని ప్రదేశాలు ఎన్నడూ మరిచిపోకూడదు..” అంటూ భూత్ బంగ్లాలో హీరో బృందం ప్రవేశించిన దృశ్యాలను చూపారు. కనుక సస్పెన్స్ హర్రర్ సినిమా అనుకోవచ్చు. ఉండిపోవే నాతోనే అంటూ ఓ రొమాంటిక్ సాంగ్ కూడా వేశారు కనుక మంచి ప్రేమ కధ కూడా ఉందనుకోవచ్చు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కౌశిక్ పెగళ్ళపాటి, సహ రచయిత: దరహాస్ పాలకొల్లు, కెమెరా: చిన్మయ్ సలాస్కర్, సంగీతం: శామ్ సీఎస్, చైతన్ భారద్వాజ్, ఆర్ట్: శివ కామేష్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమానే, అడిషనల్ స్కీన్ ప్లే: బాల గణేష్.
షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల చేసేది ఇంకా ప్రకటించాల్సి ఉంది.