
విక్రమ్ రుద్ర దర్శకత్వంలో విజయ రామరాజు, సిజ్జా రోజ్ జంటగా నటించిన ‘అర్జున్ చక్రవర్తి’ నుంచి ‘మేఘం వర్షించదా...’ అంటూ సాగే తొలిపాట ఈరోజు విడుదలైంది. కృష్ణ కాంత్ వ్రాసిన ఈ పాటని విగ్నేష్ భాస్కరన్ స్వరపరిచి, సంగీతం అందించగా కపిల్ కపిలన్, మీరా ప్రకాష్, సుజీత్ శ్రీధర్ అద్బుతంగా ఆలపించారు.
ఓ కబాడీ ప్లేయర్ జీవితగాధ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో హర్ష రోజాన్, అజయ్, అజయ్ పీసీ ఘోష్ కమీషన్, దయానంద్ రెడ్డి, దుర్గేశ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, పాటలు, దర్శకత్వం: విక్రాంత్ రుద్ర, డైలాగ్స్: రవీంద్ర పుల్లె, సంగీతం: విగ్నేష్ భాస్కరన్, కెమెరా: జగదీష్ చీకటి, ఎడిటింగ్: ప్రదీప్ నందన్ చేస్తున్నారు. గానేట్ సెల్యూలాయిడ్ బ్యానర్‌పై శ్రీని గుబ్బల నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.