రవితేజకి కన్నడ కనెక్షన్: కన్నడలో తొలి సినిమా

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ (సబ్ టైటిల్: మనదే ఇదంతా) షూటింగ్‌ను పూర్తి చేస్తుండగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నారు. 

ఈ రెండు పూర్తయ్యేముందే, ఆయన మరో కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈసారి కన్నడ దర్శకుడు అర్జున్ రవితేజకు కథ వినిపించగా ఓకే చేసినట్లు సమాచారం.  

ఈ సినిమాని ఓ ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ తెరకెక్కించనుంది. కనుక తెలుగుతో పాటు కన్నడ భాషలోనూ తీయడం ఖాయమే. ఇప్పటివరకు ఆయన సినిమాలు ఇతర భాషల్లో డబ్ అయ్యి విడుదలైనప్పటికీ, ఈ సినిమా పట్టలెక్కితే రవితేజ కెరీర్‌లో తొలిసారి కన్నడ సినిమాలో నటించినట్లవుతుంది. ఇక మాస్ జాతర విషయానికి వస్తే భాను భోగవరపు దర్శకత్వంలో శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా ఈనెల 27న విడుదల కానుంది. 

ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: విధు అయ్యన్న, ఎడిటింగ్ నవీన్ నూలి చేస్తున్నారు. 

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

ఇవికాకుండా ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాన్ శంకర్ దర్శకత్వంలో రవితేజ మరో సినిమా చేయనున్నట్టు సమాచారం.