లిటిల్ హార్ట్స్ నుంచి రాజాగాడికి ఓ పాట!

సాయి మార్తాండ్ దర్శకత్వంలో మౌళి తనుజ్ ప్రశాంత్, శివాని నగరం జంటగా చేస్తున్న ‘లిటిల్ హార్ట్స్’ నుంచి రాజగాడికి... అంటూ సాగే తొలిపాట గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌, ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, సత్య కృష్ణ, ఎస్ఎస్ కంచి, అనితా చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సాయి మార్తాండ్ , సంగీతం: సంజిత్ ఎర్రమిల్లి, కెమెరా: సురియా బాలాజీ, ఎడిటింగ్: శ్రీధర్ సొంపల్లి చేస్తున్నారు. 

బన్నీ వాసు, వంశీ నందిపాటి ఎంటర్టెయిన్మెంట్ సమర్పణలో విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మిస్తున్న లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/ZJGVOaMHtJM?si=D7kAS0gItfjwHvzN" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>