
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్ర చేస్తున్న ‘ఘాటి’ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ట్రైలర్ చివర్లో ఘాటి సెప్టెంబర్ 5 న విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ఏజన్సీ ప్రాంతంలో గంజాయి పండించి అక్కడి ప్రజలను గంజాయి రవాణా చేసే కూలీలుగా మార్చిన ఓ ముఠా నాయకుడుతో హీరోయిన్ చేసిన పోరాటమే ఘాటి కధ. ట్రైలర్లో అనుష్క నటన చూస్తే మళ్ళీ అరుంధతి సినిమాలా మరో హిట్ కొట్టబోతున్నట్లే అనిపిస్తుంది.
ఈ సినిమాకు కధ: చింతకింది శ్రీనివాసరావు, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్; కొరియోగ్రఫీ: రాజు సుందరం, కెమెరా: కాటసాని మనోజ్ రెడ్డి, ఆర్ట్: తోట తరణి, యాక్షన్: రామ్ కిషణ్, ఎడిటింగ్: వెంకటస్వామి నక్క, చాణక్య రెడ్డి తూరుపు చేశారు.
రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయి బాబు కలిసి యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో సిద్దం చేస్తున్నారు.