
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో తీస్తున్న ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ లుక్ ఈ నెల 8న (శుక్రవారం) ఉదయం 10.05గంటలకు మళ్ళీ సాయంత్రం 5.05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ ఎక్స్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టర్ కూడా చాలా భిన్నంగా ఉంది.
ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే, “చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించే రాసిన్రు.. గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. ఇది కడుపు మండిన కాకుల కధ. జమానా జమాన కెళ్ళి నడిచే శవాల కధ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఓ జాతి కధ..” అంటూ పేదల నాయకుడుగా నానిని చూపబోతున్నారని శ్రీకాంత్ ఓదెల చెప్పేశారు.
ఈ సినిమాలో నానికి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. మోహన్ బాబు, కాయడు లోహార్, రాఘవ్ జూయల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: జీకే విష్ణు, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.
2026, మార్చి 26న ‘ది ప్యారడైజ్’ విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ గ్లింమ్స్‌లోనే ప్రకటించారు.