
సినీ రచయిత బొగ్గవరపు భాను దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జోడీగా నటిస్తున్న ‘మాస్ జాతర’ (మనదే ఇదంతా సబ్ టైటిల్) నుంచి ‘ఓలే ఓలే..’ అంటూ సాగే మరో మాస్ సాంగ్ విడుదలయ్యింది. భాస్కర భట్ల వ్రాసిన ఈ పాటకి భీమ్స్ సిసిరోలియో స్వరపరిచి రోహిణి సొర్రత్‌తో కలిసి హుషారుగా పాడారు. ఈ పాటకు జానీ మాస్టర్ నృత్య దర్శకత్వం చేశారు.
మాస్ జాతరకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: బొగ్గవరపు భాను, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సినిమాటోగ్రఫీ: విద్యు అయ్యన్న, డైలాగ్స్: నందు సవిర్గమ, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న మాస్ జాతర ఈనెల 27న విడుదల కాబోతోంది.