
హరిహర వీరమల్లు సినిమా నిరాశపరచడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారికి దర్శకుడు హరీష్ శంకర్ ఓ శుభవార్త చెప్పారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేయాల్సిన సన్నివేశాల షూటింగ్ పూర్తయిందని తెలిపారు. మాట ఇస్తే నిలబెట్టుకోడం, మాత మీదే నిబడ్డం.. మీరు పక్కనుంటే కరెంటు పాకినట్లే.. అంటూ పవన్ కళ్యాణ్‌ని ప్రశంశిస్తూ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేశారు. ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోతుందని హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ చేయాల్సిన సన్నివేశాల షూటింగ్ పూర్తయిపోయింది కనుక మిగిలినవారితో మిగిలిన సినిమా పూర్తిచేయడం, చకచకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడం హరీష్ శంకర్‌కు పెద్ద పనేమీ కాదు.
కానీ ఇప్పటికే హరిహర వీరమల్లు విడుదల కాగా దాని తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ 25న సుజీత్ దర్శకత్వం చేసిన ఓజీ విడుదల కాబోతోంది. కనుక దాని తర్వాతే అంటే డిసెంబర్ నెలాఖరులోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారేమో?
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ నటిస్తున్న పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రుతీ హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: హరీష్ శంకర్, స్క్రీన్ ప్లే: కె.దశరద్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆయాంకా బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి కలిసి‘ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మిస్తున్నారు.