సినిమా పేరు: సు ఫ్రం సో... ట్రైలర్ అవుట్

కర్ణాటక నుంచి అనుష్క శెట్టి వంటి అనేక మంది హీరోయిన్లు తెలుగుతో సహా అన్ని భాషల్లో నటించి మెప్పించేవారు కానీ దక్షిణాది రాష్ట్రాలలో కన్నడ సినీ పరిశ్రమ వెనకబడిపోయినట్లు ఉండేది. కానీ ‘కాంతారా’ తర్వాత ఇప్పుడు జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతోంది. కన్నడలో తీస్తున్న సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. వాటికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది కూడా. ఆవిధంగా వస్తున్నదే ‘సు ఫ్రం సో’ సినిమా. షనీల్ గౌతం, సంధ్య అరాకిరి, ప్రకాష్ కే తుమినాడు తదితరులు ప్రధాన పాత్రలు చేసిన ఈ సినిమా  ట్రైలర్ విడుదలైంది. 

ఒక గ్రామంలో ప్రజలు ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తుంటే, ఓ దెయ్యం ఆ ఊర్లో కలకలం సృష్టిస్తుంది. అయితే ఈ సినిమాని హర్రర్-కామెడీగా తీసినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: జేపీ తుమినాడ్, సంగీతం: సుమేద్ కే, కెమెరా: ఎస్. చంద్రశేఖరన్, ఎడిటింగ్: నితిన్ శెట్టి చేశారు. ఈ సినిమా ఈ నెల 8న విడుదల కాబోతోంది.