
రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా వచ్చిన బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా,మ అంతర్జాతీయ స్థాయి హీరోగా ఎదిగిపోయారు. ఆ సినిమాలో ఎంతో గంభీరంగా గొప్ప పోరాటయోధుడుగా నటించిన ప్రభాస్ బాహుబలి షూటింగ్ జరుగుతున్నంత కాలం చాలా పని ఒత్తిడి ఉండేదని అందరికీ తెలుసు.
కానీ షూటింగ్ జరుగుతున్నంత కాలం ఆయన సెట్స్‌లో చాలా అందరితో సరదాగా కబుర్లు చెపుతూ చాలా ఎంజాయ్ చేశారనే విషయం చాలా మందికి తెలియదు. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా బాహుబలి టీమ్ సెట్స్‌లో ప్రభాస్ సరదాగా అల్లరి చేస్తున్న ఓ చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ప్రభాస్ చేతులూపుతూ ఏదో చెపుతుంటే పక్కనే రానా, ఎదురుగా అనుష్క ఆయన చెప్పేది వింటూ నవ్వుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. నేటికీ ప్రభాస్ సెట్స్‌లో అందరితో అలాగే సరదగా మాట్లాడుతూ కలిసి మెలిసి ఉంటారని రాజాసాబ్ యూనిట్ సభ్యులు కూడా చెపుతుంటారు. అందుకే ప్రభాస్ అందరికీ ‘డార్లింగ్’ అయ్యారు.
Every day on set felt like #FriendshipDay 🤗#Prabhas @RanaDaggubati @MsAnushkaShetty #BaahubaliArchives#Baahubali #BaahubaliTheEpic #Celebrating10YearsOfBaahubali#BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/tXDLsbaGxm
— Baahubali (@BaahubaliMovie) August 3, 2025