
అల్లరి నరేష్ అల్లరి మానేసి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు 64 సినిమాల వయసు వచ్చింది కనుక పెద్దరికంగా నటన, కధకు ప్రాధాన్యం ఉన్న సీరియస్ సినిమాలే చేస్తున్నారు. కనుక ప్రేక్షకులు నరేష్ అల్లరిని చాలా మిస్ అవుతున్నారు. వారి కోసం నరేష్ మళ్ళీ అల్లరి చేసేందుకు సిద్దమైపోతున్నారు.
అయితే ప్రస్తుతం టాలీవుడ్లో ‘సోషియో ఫాంటసీ సీజన్’ నడుస్తోంది కనుక అల్లరి నరేష్ కూడా ఆ ప్రకారమే తన 65వ సినిమా ప్లాన్ చేసుకున్నారు.
విశేషమేమిటంటే, ఈ సినిమాని ప్రఖ్యాత అన్నపూర్ణ స్టూడియోస్, హాస్యా మూవీస్ సంస్థతో కలిసి నిర్మించబోతోంది. కనుక రేపు (సోమవారం) ఉదయం 8 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే పూజా కార్యక్రమం జరుగబోతోంది.
ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, సినిమా టైటిల్ వగైరా త్వరలోనే ప్రకటిస్తారు.