ప్లీజ్ ప్లీజ్ మేడం... నారా రోహిత్

నారా రోహిత్, శ్రీదేవి జంటగా చేస్తున్న ‘సుందరకాండ’ నుంచి ‘ప్లీజ్ ప్లీజ్ మేడం...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ఈరోజు విడుదల చేశారు. శ్రీహర్ష ఈమని వ్రాసిన పాటకి లియాన్ జేమ్స్ సంగీతం అందించగా అర్జున్ చాందీ, దీపక్ బ్లూ, అరవింద్ శ్రీనివాస్, సాయి శరణ, రేష్మ శ్యాం, హరిప్రియ, లవిత లోబో కలిసి పాడారు. 

వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తీస్తున్న సుందరకాండలో విజయ్ కుమార్, వృతి వాఘానీ, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమతం, విశ్వంత్, రూప లక్ష్మి, సునయన, రఘు బాబు, అమృతం వాసు, అధుర్స్ రఘు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.    

సుందరకాండ సినిమాకు కథ, దర్శకత్వం: వెంకటేశ్ నిమ్మలపూడి, సంగీతం: లియోన్ జేమ్స్, కోరియోగ్రఫీ: విశ్వ రఘు, కెమెరా : ప్రభీష్ ఎం వర్మ, యశ్, ఆర్ట్: రాజేష్ పెంటకోట, స్టంట్స్:  పృథ్వీ మాస్టర్, ఎడిటింగ్: రోహాన్ చిల్లలే చేస్తున్నారు. 

సందీప్ పిక్చర్ ప్యాలస్ బ్యానర్‌పై  సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహాంకల్లి కలిసి నిర్మిస్తున్న సుందరాకాండ ఆగస్ట్ 27న విడుదల కాబోతోంది.