ఓజీ…విన్నారా? ఇవ్వాళ్ళ సాయంత్రమే మొదటి పాట రిలీజ్‌

జూన్ 12న విడుదలైన ‘హరిహర వీరమల్లు’ తీవ్ర నిరాశ పరచడంతో పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఇప్పుడు ‘ఓజీ’ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తీస్తున్న ఈ యాక్షన్ ప్యాక్ సినిమా వచ్చే నెల (సెప్టెంబర్‌) 25న విడుదల కాబోతోంది.

కనుక ముందుగా ఈరోజు ఓజీ నుంచి మొదటి పాట విడుదల చేయబోతున్నారు. హైదరాబాద్‌, బాలానగర్ వద్ద గల విమల్ థియేటర్లో శనివారం సాయంత్రం ఈ పాట లాంచింగ్ ఈవెంట్‌ నిర్వహించబోతున్నారు. దీంతో ఈరోజు ఉదయం నుంచే విమల్ థియేటర్ వద్ద అభిమానుల సందడి మొదలైపోయింది.      

ముంబయి అండర్ వరల్డ్ గ్యాంగుల మద్య ఘర్షణల నేపధ్యంతో సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్‌ ఉత్తమన్, అభిమన్యు సింగ్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 25న ఓజీ విడుదల కాబోతోంది.