మదరాసీ నుంచి సెలవిక... ఫస్ట్ సింగిల్

ఇప్పుడు తెలుగు సినిమాలను 5 భాషల్లో పాన్ ఇండియా మూవీలుగా తీస్తుంటే, కోలీవుడ్‌లో తమిళ సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి వరుసపెట్టి విడుదల చేస్తున్నారు. తాజాగా విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ జంటగా చేసిన  ‘సార్   మేడం’ తెలుగు వెర్షన్ విడుదలకాగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీని తర్వాత రజనీకాంత్ నటించిన ‘కూలీ’ తెలుగు వెర్షన్ ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. 

తాజాగా కోలీవుడ్‌ హీరో శివకార్తికేయన్ హీరోగా చేసిన ‘మదరాసీ’ డబ్బింగ్ వెర్షన్ అదే పేరుతొ సిద్దమవుతోంది. ఈ సినిమా నుంచి సెలవిక సెలవిక... అంటూ సాగే మొదటి పాట నేడు విడుదల చేశారు. శ్రీనివాస మౌళి వ్రాసిన ఈ పాటకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా ధనుంజయ్ సీపాన పాడారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: మురుగదాస్, సంగీతం: అనిరుద్ రవిచందర్, కోరియోగ్రఫీ: శేఖర్ వీజే చేశారు. సెప్టెంబర్‌ 5న ఈ సినిమా విడుదల కాబోతోంది.

 <iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/bjCDWC60Zs8?si=mmFGCausdWUOuZ6O" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>