నిన్ను ప్రేమించేవాళ్ళకు తెలుసు ఇదెంత గొప్పదో: రష్మిక

ఈరోజు విడుదలైన విజయ్ దేవరకొండ చిత్రం ‘కింగ్‌డమ్‌’ పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ఆ అభిమానులలో విజయ్ దేవరకొండ ప్రియురాలు రష్మిక మందన కూడా ఒకరు.

సినిమా హిట్ అయ్యిందని తెలియగానే ఆమె తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండతో పంచుకుంటూ, “ఈ విజయం ఎంత గొప్పదో నీకు, నిన్ను ప్రేమించే వారందరికీ తెలుసు,” అని ట్వీట్ చేశారు. 

విజయ్ దేవరకొండ కూడా వెంటనే స్పందిస్తూ, “మనం కొట్టినాం” అంటూ జవాబిచ్చారు. వారిద్దరి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

రష్మిక ఖాతాలో కూడా తాజాగా కుబేరతో హిట్ పడింది. కనుక నెల రోజుల గ్యాప్‌తో విడుదలైన ఇద్దరి పాన్ ఇండియా మూవీలు సూపర్ హిట్ అవడంతో వారితో పాటు అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఏడాది ఇద్దరికీ చాలా బాగుంది కనుక పెళ్ళి కూడా చేసేసుకుంటే ఇంకా బాగుటుంది కదా?