
హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో రాజాసాబ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు హటాత్తుగా దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మీలు రాజా సాబ్ సెట్స్‌లో ప్రత్యక్షమయ్యారు. పూరీని మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత చూడటంతో మన రాజాసాబ్ సంతోషం పట్టలేక ఆప్యాయంగా కౌగలించుకున్నారు. షూటింగ్ మద్యలో బ్రేక్ తీసుకొని ఇద్దరితో చాలాసేపు మాట్లాడారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ బుజ్జిగాడు (2007), ఏక్ నిరంజన్ (2009) రెండు సినిమాలు చేశారు. మళ్ళీ అప్పటి నుంచి ఇద్దరూ కలిసి సినిమా చేయలేదు. కానీ అప్పటి నుంచే ప్రభాస్-పూరీ మద్య మంచి స్నేహం ఏర్పడింది. నిజానికి ప్రభాస్ ఎవరితో సినిమాలు చేసినా వారందరితో స్నేహం ఏర్పడుతూనే ఉంటుంది కూడా.
ఇన్నేళ్ళ తర్వాత పూరీ, ఛార్మీలు ప్రభాస్ వద్దకు ఊరికే వచ్చి ఉండకపోవచ్చు. ఎదో మంచి కధతోనే వచ్చి ఉంటారు. ఒకవేళ ప్రభాస్ అంగీకరిస్తే మళ్ళీ వారిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుంది.
కానీ ప్రభాస్ మరో 5-6 ఏళ్ళ వరకు ఖాళీ దొరకరు. వరుసపెట్టి ఓ అర డజను సినిమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ అన్నేళ్ళు పూరీ ఎదురుచూదలేరు. కనుక ఒకవేళ పూరీకి ప్రభాస్ మాట ఇస్తే ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల మద్య సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.