
సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత, ప్రముఖ నిర్మాత నాగ వంశీ ఈరోజు సోషల్ మీడియాలో తమ కొత్త సినిమాని ప్రకటించారు. అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా తీయబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. దోపిడీ, అణచివేతకు గురైన ఓ ప్రాంతంలో తిరుగుబాటు మొదలైందని తెలియేస్తూ వేసిన పోస్టర్ చాలా ఆకట్టుకుంటుంది.
సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నంబర్: 36గా తీయబోతున్న ఈ సినిమాలో ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ భాగస్వాములుగా ఉంటాయి. నాగ వంశీ సాయి సౌజన్య కలిసి ఈ సినిమా నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.
Not all Rebels are forged in Battle. ⚔️
— Naga Vamsi (@vamsi84) July 30, 2025
Some are chosen by Destiny
And this is that story of a Rebel..💥💥
Proudly announcing @SitharaEnts Production No.36 with the versatile and dynamic @shetty_rishab garu. 🔥🔥
Directed by @AshwinGangaraju #SaiSoujanya @Fortune4Cinemas… pic.twitter.com/VDX3tjmwaT