ప్రభాస్-హను సినిమా టైటిల్‌ ఆగస్ట్ 15న?

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేస్తున్న సినిమా పేరు ‘ఫౌజీ’ అని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఇది దేశం కోసం జరిగిన పోరాటాలతో చారిత్రిక నేపధ్యంతో తీస్తున్న సినిమా కనుక వచ్చే నెల ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ ప్రకటించి,  ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తని మైత్రీ మూవీ మేకర్స్‌ ధృవీకరించాల్సి ఉంది. 

ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా కొత్త హీరోయిన్‌ ఇమాన్వీ నటిస్తోంది. అలనాటి అందాల నటి జయప్రద, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది.   

ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు రామోజీ ఫిలిమ్ సిటీలో జరిగింది. మరికొన్ని రోజులు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. 

ఈ సినిమాకి సంగీత దర్శకత్వం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.