
‘రాజాసాబ్’ గురించి ప్రభాస్ అభిమానులు కూడా మరిచిపోక తప్పదన్నట్లు ఉంది దర్శకుడు మారుతి తీరు. ఈ సినిమాకు సంబందించి ఎటువంటి అప్‌డేట్ ఇవ్వాల్సిన అవసరమే లేదనట్లు వ్యవహరిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా మారడం వలన మూడు సినిమాలు పూర్తిచేయడానికి చాలా సమయం తీసుకున్నప్పటికీ, ఇటీవల వీలు చూసుకొని ఒక్కో సినిమా పూర్తి చేసేస్తున్నారు. అవి వరుసపెట్టి విడుదల అయ్యేందుకు సిద్దం అవుతున్నాయి. కానీ రాజాసాబ్‌కి డిసెంబర్ 5న విడుదల చేస్తామని ప్రకటించేసి చేతులు దులుపుకున్నట్లు అనిపిస్తుంది. ఇది ప్రభాస్ అభిమానులకు చాలా అసహనం కలిగిస్తోందని తెలిసి ఉన్నప్పటికీ మారుతి కనీసం ఎప్పటికప్పుడు అప్‌డేట్ కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా రాజాసాబ్‌లో ఆయన పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఆయన నమ్మినవారి చేతిలో మోసపోయి హత్య చేయబడిన ‘ పెద్ద రాజాసాబ్’గా నటించారు. చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ తన ప్యాలస్‌లో ఉండిపోతుంది. కనుక సంజయ్ దత్ పోస్టర్ కాస్త భయంకరంగానే ఉంది.
చనిపోయిన ఆ పెద్ద రాజాసాబ్ సినిమా మనుమడిగా ప్రభాస్ నటించారు. ఆ భవనంలోకి ప్రభాస్ ప్రవేశించడంతో అసలు కధ మొదలవుతుందని టీజర్ చూస్తే అర్దమవుతుంది.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు వస్తారు కనుక అంతవరకు అప్‌డేట్ ఇవ్వకపోయినా అభిమానులు ఓపికగా ఎదురు చూడాల్సిందే.