ఆకాశం అందిందా...నేలంతా నవ్విందా... తెలుసు కదా?

సిద్దు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా జంటగా చేస్తున్న ‘తెలుసు కదా?’ సినిమా నుంచి ‘ఆకాశం అందిందా...నేలంతా నవ్విందా...’ అంటూ సాగే వీడియో సాంగ్ మంగళవారం విడుదల చేశారు. కృష్ణ కాంత్ వ్రాసిన ఈపాటకి తమన్ సంగీతం అందించగా సిద్ శ్రీరామ్‌ పాడారు. 

ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, హర్ష చెముడు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం:  నీరజ్ కోనా సంగీతం: తమన్, కెమెరా: జ్ఞాన శేఖర్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలవబోతోంది... తెలుసు కదా?