
విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో ‘కింగ్డమ్’ ఈనెల 31న విడుదల కాబోతోంది కనుక ఇటీవలే ట్రైలర్ విడుదల చేశారు. సోమవారం హైదరాబాద్, యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్లో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ‘రగిలే రగిలే...’ పాట పాడుతూ లైవ్ పెర్ఫార్మెన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ కూడా ఈ ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా భాగ్యశ్రీ భోరే నటించగా రుక్మిణీ వసంత్ కౌశిక్ మహత, కేశవ్ దీపక్, మణికంఠ వారణాసి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: గిరీష్ గంగాధరన్, జోమన్ టి జాన్, ఎడిటింగ్: నవీన్ నూలి, యాక్షన్: యానిక్ బెన్, చేతన్ డిసౌజా, రియల్ సతీష్ చేశారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన కింగ్డమ్ ఈనెల 31న విడుదల చేస్తున్నారు.