‘మైసా’కి రష్మిక కొబ్బరికాయ కొట్టేశారు

ఇంతకాలం రష్మిక మందన్న తన అందచందాలతో, అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించారు. తొలిసారిగా హీరోయిన్‌-ఓరియంటడ్‌ సినిమా ‘మైసా’ చేయబోతున్నారు.   

రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్: 1గా తీయబోతున్న ‘మైసా’కి నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు క్లాప్ కొట్టగా, సినీ కధ రచయిత కొల్ల కెమెరా స్విచ్ ఆన్‌ చేశారు. ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి గౌరవ దర్శకత్వం వహించారు.  

ఈ సినిమా ప్రకటించినప్పుడే ‘వేటాడబడి, గాయపడినప్పటికీ నిబ్బరం కోల్పోని యోధురాలు మైసా’ అమెని హీరోయిన్‌ పాత్రని పరిచయం చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. 

ఈ సినిమాని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి కలిసి పాన్‌ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: రవీంద్ర పుల్లె చేస్తున్నారు. ఈ సినిమాల నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.