
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా జూలై 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తమ్ముడు’ అందరూ ఊహించినట్లే బోర్లా పడింది. ఇప్పుడు ఈ సినిమా ఆగస్ట్ 1న నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతోంది.
ఈ సినిమాలో సప్తమి గౌడ, లయ, హర్ష బొల్లమ్మ, సూరబ్ సచ్ దేవ్, శ్వాసిక, హరితేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, సతీష్ కలిసి నిర్మించారు.
క్లుప్తంగా తమ్ముడు కధ... జై (నితిన్) విలువిద్యలో భారత్‌కు బంగారు పతకం సాధించాలనుకుంటాడు. కానీ చిన్నప్పటి నుంచే తాను ఎంతగానో ప్రేమించే అక్క స్నేహలత అలియాస్ ఝాన్సీ (లయ) దూరం పెట్టడంతో లక్ష్యం సాధించలేకపోతాడు.
స్నేహితురాలు చిత్ర (వర్ష బొల్లమ) సూచన మేరకు ఆక్కని కలిసేందుకు వైజాగ్ వస్తాడు. అక్కడ అక్కని చంపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న జై వారి నుంచి అక్కని కాపాడుకుంటాడు.
ఆమెను వారు ఎందుకు చంపాలనుకున్నారు? ఆమె తమ్ముడిని చిన్నప్పుడే ఎందుకు దూరం పెట్టింది?రెండు ప్రశ్నలు ఆగస్ట్ 1న నెట్‌ఫ్లిక్స్‌లోకి తమ్ముడు వచ్చినప్పుడు తెలుసుకుంటే సరిపోతుంది.