
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోరే జంటగా చేసిన ‘కింగ్‌డమ్’ సినిమా ఈ నెల 31న విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి తిరుపతి పట్టణంలో నెహ్రూ మునిసిపల్ గ్రౌండ్స్‌లో కింగ్‌డమ్ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ జరుగబోతోంది.
దీని తర్వాత ఈ నెల 28న (సోమవారం) హైదరాబాద్, యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో కింగ్‌డమ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగబోతోంది. ఈ రెండు ఈవెంట్స్‌కి టికెట్స్, పాసులు కావలసినవారు https://www.shreyasgroup.net/event వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌లో రుక్మిణీ వసంత్, కౌశిక్ మహత, కేశవ్ దీపక్, మణికంఠ వారణాసి తదితరులున్నారు.
ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: గిరీష్ గంగాధరన్, జోమన్ టి జాన్, ఎడిటింగ్: నవీన్ నూలి, యాక్షన్: యానిక్ బెన్, చేతన్ డిసౌజా, రియల్ సతీష్ చేస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 31న విడుదల కాబోతోంది.