పుట్టబోయే బిడ్డ కోసం వరుణ్ తేజ్ షాపింగ్ షురూ!

తెలుగు సినీ నటుడు వరుణ్ తేజ్ త్వరలో తండ్రి కాబోతున్నందున పుట్టబోయే బిడ్డ కోసం అవసరమైన దుస్తులు, బొమ్మల షాపింగ్ మొదలు పెట్టేశారు. దాదాపు ఆరేళ్ళపాటు ప్రేమించిన సహ నటి లావణ్య త్రిపాఠిని 2023 నవంబర్‌లో పెళ్లి చేసుకున్నాడు.

రెండు నెలల క్రితం తమ ఇంట్లోకి చిన్నారి రాబోతోందంటూ సోషల్ మీడియాలో ఫోటో పెట్టి అభిమానులకు తెలియజేశారు. ఇప్పుడు షాపింగ్ మొదలుపెట్టేశారు కనుక లావణ్య త్రిపాఠి బిడ్డను ప్రసవించే సమయం దగ్గర పడిందనే అనుకోవాలి.

ఆమె గర్భం దాల్చిన తర్వాత  కొత్తగా సినిమాలు ఏవీ ఒప్పుకోకుండా ఆమెతో కలిసి విదేశాలలో విహార యాత్రలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

వరుణ్ తేజ్ చివరిగా చేసిన పీరియాడికల్ మూవీ ‘మట్కా’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కానీ వరుణ్ తేజ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. 

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ హర్రర్ కామెడీ సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్లపై నిర్మించబోతున్న ఈ సినిమాకి ధమన్‌ సంగీతం అందిస్తున్నారు.