వార్-2 ట్రైలర్: జూ.ఎన్టీఆర్‌ యాక్షన్ అంటే ఇది కదా!

జూ.ఎన్టీఆర్‌ నటించిన కొన్ని తెలుగు సినిమాలు హిందీలో విడుదలైనప్పటికీ మొట్ట మొదటిసారిగా చేసిన హిందీ చిత్రం వార్-2. ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ‘వార్-2'లో బాలీవుడ్‌ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ విలన్‌గా నటించగా జూ.ఎన్టీఆర్‌ అతనిని అంతమోదించేందుకు బయలుదేరిన ‘రా ఏజంట్’గా నటించారు. ఈ సినిమాని హిందీ, తెలుగుతో సహా 5 భారతీయ భాషల్లో ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. 

ఈరోజు వార్-2 ట్రైలర్ తెలుగుతో సహా అన్ని భాషలలో ఒకేసారి విడుదల చేశారు. సినిమా పేరే ‘వార్-2’ కనుక ఊహించినట్లే ట్రైలర్లో యాక్షన్ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే ‘జూ.ఎన్టీఆర్‌ యాక్షన్ సీన్స్ చేస్తే ఇలా ఉంటుంది కదా? అని అభిమానులు అనుకోకుండా ఉండలేరు. అంత అద్భుతంగా చేశారు. ఇది బేసిక్‌గా హిందీ సినిమా కనుక హృతిక్ రోషన్‌కి అంతే ప్రాధాన్యం ఇచ్చారు. ఇద్దరూ కలిసి చేసిన యాక్షన్ సీన్స్ యూట్యూబ్‌లో చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇక సినిమా థియేటర్లలో పెద్ద స్క్రీన్స్ మీద చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

ఈ సినిమాకి కధ: ఆదిత్య చోప్రా, దర్శకత్వం: ఆయన్ ముఖర్జీ , స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్, సంగీతం: ప్రీతం, కెమెరా: బెంజామిన్, ఎడిటింగ్: ఆరీఫ్ షేక్, స్టంట్స్: స్పైరో రాజాతోస్, ఫ్రాంజ్ స్పిల్ హౌస్, అనల్ అరసు చేశారు.  

ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ప్రముఖ బాలీవుడ్‌ సినీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.