
పవన్ కళ్యాణ్ కధానాయకుడుగా ‘హరిహర వీరమల్లు’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ అభిమానులు మాత్రం సినిమా చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో హరిహర వీరమల్లు సక్సస్ మీట్ జరుగుతోంది. ఈ సందర్భంగా అభిమానుల కోసం చిత్ర బృందం ఓ చిరు కానుక ఇచ్చింది.
ఈ సినిమాలోని సలసల మరిగే నీలోని రక్తమే.... అంటూ సాగే పాట లిరికల్ వీడియోని విడుదల చేసింది. చైతన్య ప్రసాద్ వ్రాసిన ఈ పాటని ఎంఎం కీరవాణి స్వరపరిచి సంగీతం అందించగా సాయి చరణ్ భాస్కరుని, లోకేశ్వర్, పీవీ ఎన్ఎస్ రోహిత్ కలిసి పాడారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి జోడీగా నిధీ అగర్వాల్ నటించగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబుగా నటించారు. అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఇంకా విక్రమ్ జీత్, జిష్ణుసేన్ గుప్తా, నోరాహి ఫతేహి, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మించారు.