
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోరే జంటగా చేసిన ‘కింగ్‌డమ్’ సినిమా ఈ నెల 31న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం నేడు జీవో విడుదల చేసింది.
ఈ నెల 31న సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.75 వరకు పెంచుకునేందుకు అనుమతించింది. ఈరోజు విడుదలైన హరిహర వీరమల్లుకి తెలంగాణ ప్రభుత్వం అదనపు షోలు వేసుకునేందుకు, టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతించింది కనుక విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’కి కూడా అనుమతిస్తుందా లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ నెల 26న తిరుపతి పట్టణంలో నెహ్రూ మునిసిపల్ స్టేడియంలో ‘కింగ్‌డమ్’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరుగబోతోంది.
ఈ సినిమాలో రుక్మిణీ వసంత్, కౌశిక్ మహత, కేశవ్ దీపక్, మణికంఠ వారణాసి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: గిరీష్ గంగాధరన్, జోమన్ టి జాన్, ఎడిటింగ్: నవీన్ నూలి, యాక్షన్: యానిక్ బెన్, చేతన్ డిసౌజా, రియల్ సతీష్ చేస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 31న విడుదల కాబోతోంది.