హరిహర వీరమల్లు సక్సస్ మీట్ అప్పుడేనా?

హరిహర వీరమల్లు సినిమా ఈరోజు (జూలై 24) విడుదలైయింది. అంటే ఇంకా24  గంటలు కాలేదు. పైగా ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. కానీ చిత్ర బృందం అప్పుడే సినిమా ‘సక్సస్ మీట్’కు సిద్దమైపోయారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి హైదరాబాద్‌, దసపల్లా హోటల్లో ‘సక్సస్ మీట్’ నిర్వహించబోతున్నామని తెలియజేశారు. 

పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు ఈ సినిమా ఎలా ఉన్నా నచ్చుతుంది కనుక వారు అద్భుతంగా ఉందంటూ సంబురాలు చేసుకుంటున్నారు సంతోషమే. కానీ ఇది చారిత్రిక నేపధ్యంతో తీసిన ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ని ఓ సమరయోధుడుగా చూపిస్తారనుకుంటే రాబిన్‌హుడ్ తరహాలో చూపించడం, మద్యలో సనాతన ధర్మం అంటూ డైవర్షన్ సినిమాని దెబ్బ తీశాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

కనీసం సినిమా మొదటి నుంచి చివరి వరకు ‘రాబిన్‌హుడ్’లా పవన్‌ కళ్యాణ్‌ని చూపినా బాగుండేది కానీ పోరాటయోధుడుగా చూపారని, కనుక కధని గందరగోళంగా మార్చేశారని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. 

సినిమాకు ఇటువంటి మిశ్రమ స్పందన వస్తున్నప్పుడు థియేటర్లలో నిలబడగలదో లేదో చూసుకోకుండా మొదటి రోజే ‘సక్సస్ మీట్’ ఎందుకు? ఒకవేళ సినిమా ఆడకపోతే ‘సక్సస్ మీట్’ అవమానంగా మిగిలిపోదా?అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.