సూర్యకి పుట్టిన రోజు శుభాకాంక్షలు: వెంకీ అట్లూరి

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయనతో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయబోతున్న ను వెంకీ అట్లూరి ఒక చక్కటి పోస్టర్‌తో శుభాకాంక్షలు తెలియజేశారు. వారిద్దరి కాంబినేషన్‌లో ఓ చక్కటి ఫ్యామిలీ స్టోరీతో సినిమా చేయబోతున్నారు. 

ఈ సినిమాలో సూర్యకు జోడీగా మమితా బైజు హీరోయిన్‌గా నటించబోతున్నారు. రవీనా టండన్, రాధిక ముఖ్యపాత్రలు చేయబోతున్నారు. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా తీయబోతున్నారు. 

శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ సినిమా నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది.