చిరు-అనిల్ అప్పుడే మూడో షెడ్యూల్ ఫినిష్!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా చేస్తున్న సినిమా షూటింగ్‌ ఎంత వేగంగా సాగుతోందంటే అప్పుడే కేరళలో మూడో షెడ్యూల్ పూర్తి చేసి హైదరాబాద్‌ తిరిగి వచ్చేశారు. ఈ విషయం తెలియజేస్తూ “మన శంకరవరప్రసాద్ గారు” ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తిచేసుకుని వచ్చారు,” అంటూ షైన్ స్క్రీన్స్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.

దానిలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహుగారపాటి ముగ్గురూ ప్రైవేట్ ఫ్లైట్‌లో కేరళ నుంచి హైదరాబాద్‌లో దిగుతున్నారు.    చిరంజీవి అసలు పేరు ‘శివశంకర వరప్రసాద్‌’ అని అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అదే పేరుతొ నటిస్తున్నారు. 

ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా క్యాథరిన్‌ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హర్షవర్ధన్, అభినవ్ గోమటంల, సచిన్ కేడ్కర్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్‌ అతిధి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంకా ధృవీకరించాల్సి ఉంది.

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. 

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాని 2026 సంక్రాంతి పండుగకి విడుదల కాబోతోంది.