ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్‌లో చిన్న బ్రేక్

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో ‘ఎస్ఎస్ఎంబీ29’ వర్కింగ్  టైటిల్‌తో తీస్తున్న సినిమా షూటింగ్‌లో చిన్న బ్రేక్ తీసుకున్నారు అందరూ. బ్రేక్ దొరకడంతో మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి శ్రీలంకలో గడిపేందుకు వెళ్ళిపోయారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంకా చొప్రాకూడా బహామాస్ వెళ్ళి సేద తీరుతున్నారు. రాజమౌళి మాత్రం ఎప్పటిలాగే సినిమా పనులతో బిజీబిజీగా గడుపుతున్నారు. ‘బాహుబలి రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా ‘బాహుబలి: ది ఎపిక్’ అనే పేరుతో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కనుక ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. మళ్ళీ ఆగస్ట్ రెండో వారంలో ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్‌ మొదలవుతుందని సమాచారం.