
కోలీవుడ్ హీరో సూర్య, త్రిష ప్రధాన పాత్రలలో తమిళంలో నిర్మిస్తున్న ‘కురుప్పు’ని అదే పేరుతొ తెలుగులో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈరోజు ఈ సినిమా టీజర్ విడుదలైంది. గత కొన్నేళ్లుగా విభిన్నమైన కధలు, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న సూర్య ఇప్పుడు మళ్ళీ ‘కురుప్పు’తో పక్కా మాస్ మసాలా సినిమా చేసినట్లు టీజర్ చూస్తే అర్ధమవుతుంది.
ఆర్‌జేబీ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమాలో ఇంద్రన్స్, నత్తి, స్వసిక, శివద, అనఘ మాయ రవి, సుప్రీత్ రెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఆర్‌జేబీ, సంగీతం: సాయి అభయంకర్, కెమెరా: శోభి- శాండీ, స్టంట్స్: అన్ భైరవ్, విక్రమ్ మోర్, ఎడిటింగ్: ఆర్.కలైవనన్ చేస్తున్నారు.
డ్రీమ్ వారియర్ పిక్చర్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.