జూలై 26న మిరాయ్ నుంచి మొదటి పాట

హనుమాన్ తర్వాత తేజ సజ్జా ‘మిరాయ్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ‘మిరాయ్’ టీజర్‌ అద్భుతంగా ఉంది. సినిమాపై అంచనాలు పెంచింది. ఇప్పుడు మిరాయ్ నుంచి మొదటి పాట ఈ నెల 26న విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ హీరో,హీరోయిన్లతో ఓ చక్కటి పోస్టర్ నేడు సోషల్ మీడియాలో పెట్టారు.     

ఘట్టమనేని కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజ సజ్జకు జోడీగా రీతికా నాయక్ నటిస్తుండగా మంచు మనోజ్ దుష్టశక్తుల నాయకుడుగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీయ శరణ్, జయరాం, రాజేంద్రనాధ్ జుట్శీ, పవన్ చోప్రా, తాంజ కెల్లర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.  

ప్రపంచాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ దుష్టశక్తిని ‘మిరాయ్’ అనే అతీతశక్తులు కలిగిన ఓ ఆయుధంతో ‘సూపర్ యోధ’ ఏవిదంగా అడ్డుకుంటాడనేది ఈ సినిమా కధ. 

ఈ సినిమాకి దర్శకత్వం, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గౌర హరి, ఆర్ట్: శ్రీ నాగేంద్ర తంగెల చేస్తున్నారు. 

మిరాయ్ సినిమాని సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దీనిని తెలుగు, తమిళ్, కన్నడం మలయాళం, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో 2డి, 3డి ఫార్మాట్‌లో నిర్మింస్తున్నారు. మిరాయ్ ఈ ఏడాది సెప్టెంబర్‌ 5న విడుదల కాబోతోంది.