2.0 లో తెలుగు స్టార్ హీరో..!

శంకర్, రజినికాంత్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న సినిమా 2.0. 340 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఈ ప్రయత్నంలో ఇప్పుడు మరో సర్ ప్రైజ్ న్యూస్ తెలుగు ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది. కోలీవుడ్లో నిర్మితమవుతున్న ఈ సినిమా తెలుగు, హింది వర్షన్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ ప్రయత్నంలో తెలుగు స్టార్ హీరో కెమియో సినిమాలో ఉండబోతుందట. అది కేవలం తెలుగు వర్షన్ కు మాత్రమేనా లేక అన్ని భాషల్లోనా అన్నది తెలియలేదు కాని ఓ స్టార్ మాత్రం శంకర్, రజినిల 2.0లో ఉంటాడని అంటున్నారు.

ఇప్పటికే రజినికి విలన్ గా అక్షయ్ కుమార్ నటిస్తుండగా ఇప్పుడు మరో తెలుగు స్టార్ హీరో కూడా చేస్తున్నాడంటే ఇక ఆ ప్రాజెక్ట్ ఏ రేంజ్ క్రేజ్ సంపాదిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ రోల్ కు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ ను కాని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అదే కనుక నిజం అయితే 2.0 రికార్డులు షురూ చేయడం ముందే కన్ఫాం చేయొచ్చు. బాహుబలి రికార్డులను టార్గెట్ తో వస్తున్న ఈ సౌత్ బిగ్గెస్ట్ మూవీ ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాలి.