ఉస్తాద్ భగత్ సింగ్‌లో రాశీ ఖన్నా ఫస్ట్-లుక్

హరీష్ శంకర్‌-పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో తీస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో రెండో హీరోయిన్‌గా రాశీ ఖన్నా ఎంపికయ్యారని మొన్ననే చెప్పుకున్నాము. ఆమెకు స్వాగతం పలుకుతూ మైత్రీ మూవీ మేకర్స్‌ ఆమె ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేసింది. 

ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు శ్లోక. కెమెరా పట్టుకొని నిలబడున్న పోస్టర్ పెట్టారు కనుక బహుశః ఆమె ఈ సినిమాలో మీడియా ఫోటోగ్రాఫర్‌ నటిస్తున్నట్లున్నారు. 

ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ పోలీస్ ఆఫీసర్‌గా, ఆయనకి జోడీగా శ్రీలీల నటిస్తుండగా నవాబ్ షా, అవినాష్, అశుతోష్ రాణా, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్ బాబు, టెంపర్ వంశీ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: హరీష్ శంకర్‌, స్క్రీన్ ప్లే: కె.దశరద్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆయాంకా బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి కలిసి నిర్మిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.