గరివిడి లక్ష్మి ఫస్ట్ గ్లిమ్స్....

ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో సంస్కృతీ సంప్రదాయాలు, భాష, యాస, స్థానిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ చక్కటి సినిమాలు వస్తున్నాయి. అటువంటివే బలగం... జయమ్మ పంచాయితీ వంటి సినిమాలు. వాటిని ఆస్వాదించగలిగితే కలిగే ఆనందం వేరు. 

ఒకప్పుడు బుర్రకధలు, హరికధలు వాడవాడన వినిపించేవి కనిపించేవి. ఇప్పుడు వాటికి ఆదరణ కరువవడంతో  కనపడటం లేదు. విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ బుర్రకధ కళాకారిణి ‘గరివిడి లక్ష్మి’ జీవితకధ ఆధారంగా ఆమె పేరుతోనే ఓ సినిమా వస్తోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ నేడు విడుదల చేశారు.   

గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో వస్తున్న ‘గరివిడి లక్ష్మి’లో ఆనంది ప్రధాన పాత్ర చేయగా సీనియర్ నరేష్, రాశి, రాగ్ మయూర్, శరణ్య ప్రదేప్, అనిత కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, కుశాలిని తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: జె ఆదిత్య చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి ఈ సినిమా నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.