హరిహర వీరమల్లు మేకింగ్ వీడియో... చూశారా?

జ్యోతీ కృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో ‘హరిహర వీరమల్లు’ మరో నాలుగు రోజుల్లో అంటే 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా మేకింగ్ వీడియో నేడు విడుదల చేశారు. అది చూస్తే ఈ సినిమా కోసం యూనిట్ సభ్యులు అందరూ ఎంతగా శ్రమించారో అర్ధమవుతుంది. ఈ మేకింగ్ వీడియోకి ‘పులిని తినే బెబ్బులొచ్చెరో దొరా....’ అంటూ సాగే మరోపాటని కూడా జోడించారు. చంద్రబోస్ వ్రాసిన ఈ పాటకి సంగీతం కీరవాణి అందించగా హారిక నారాయణ్ పాడారు.    

హరిహర వీరమల్లు ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ నెల 20న హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లుకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. వీరమల్లు సినిమా రన్ టైం 2.42 గంటలు.   

హరిహర వీరమల్లులో బాలీవుడ్‌ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, విక్రమ్ జీత్, జిష్ణుసేన్ గుప్తా, నోరాహి ఫతేహి, దక్షిణాది నుంచి ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లుని మొదలుపెట్టగా జ్యోతీ కృష్ణ దర్శకత్వంలో దానిని పూర్తి చేశారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, జ్యోతి కృష్ణ, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్. 

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించిన హరిహర వీరమల్లు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.