రామోజీ ఫిల్మ్ సిటీలో జోరుగా మిరాయ్ షూటింగ్

హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యువ హీరో తేజ సజ్జా, తర్వాత కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘మిరాయ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో ‘మిరాయ్’లోని కొన్ని యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జోరుగా సాగుతోంది. 

ఈ సినిమాలో కూడా అపూర్వ శక్తులు కలిగిన సూపర్ హీరోగా తేజ సజ్జా నటిస్తున్నాడు. అతనికి జోడీగా రితికా నాయక్ నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, శ్రీయ శరణ్, జయరాం, రాజేంద్రనాధ్ జుట్శీ, పవన్ చోప్రా, తాంజ కెల్లర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.  

ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడం మలయాళం, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో 2డి, 3డి ఫార్మాట్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మిరాయ్ ఈ ఏడాది సెప్టెంబర్‌ 5న విడుదల కాబోతోంది. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/nsqHCfO1ayQ?si=v_r2D8UNuK6zjJIM" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>