
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ తన ‘కింగ్’ సినిమా షూటింగులో గాయపడ్డారు. తాజా సమాచారం ప్రకారం అయన కండరాలకు గాయం అయినట్లు తెలుస్తోంది. తక్షణమే ప్రాధమిక చికిత్స చేసుకొని తన సిబ్బందితో కలిసి మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్ళిపోయారు.
ముంబాయిలో ఓ ప్రముఖ స్టూడియోలో ‘కింగ్’ సినిమాలో యాక్షన్ సన్నివేశాలలో పాల్గొన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. షారూక్ ఖాన్ చాలా కాలంగా కండరాల సమస్యలతో బాధ పడుతున్నారు. కనుక ఈ గాయానికి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరమని వైద్యుల సూచన మేరకు అమెరికా వెళ్ళారు. వైద్యులు సూచన మేరకు అయన నెల రోజులు విశ్రాంతి తీసుకుంటారు. కనుక ఆయన తిరిగి వచ్చేవరకు ‘కింగ్’ షూటింగ్ వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు సిద్ధార్ద్ ఆనంద్ తెలిపారు.
కింగ్ సినిమాలో దీపికా పడుకొనే, రాణీ ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, జాకీ ష్రాఫ్, రాఘవ్ జూయాల్, అనిల్ కపూర్, సుహానా షారూక్ ఖాన్, సురభ్ శుక్లా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.